YS SHARMILA: తోపులాటలో కిందపడిపోయిన షర్మిల

Ys Sharmila: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నివాసం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి.. అక్కడి పరిస్థితులను స్వయంగా చూడాలని బయల్దేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో షర్మిల కింద పడిపోయారు. కేసీఆర్ తనను చూసి భయపడుతున్నారని షర్మిల విమర్శించారు. తమ పార్టీ నేతలను ఎక్కడికి వెళ్లకుండా గృహనిర్బంధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ నియంత అని మరోసారి నిరూపితం అయిందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా సీఎం నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజల తరఫున గొంతు వినిపిస్తే అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోడీ,హోమ్ శాఖ మంత్రి అమిత్ షా,సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేదని షర్మిల ఆరోపించారు. ప్రజల గొంతు వినిపించినా అరెస్ట్ లు చేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ నియంత అని మరో సారి నిరూపణ అయ్యిందని, వైఎస్సార్ బిడ్డకు కేసీఅర్ భయపడుతున్నాడని షర్మిల తెలిపారు.

ఇచ్చిన ఒక్క వాగ్ధానం కూడా నిలబెట్టుకోలేదని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టడానికి, జనతా రైడ్ కి పిలుపు నిచ్చామన్నారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని అనుకున్నామని, అందులో భాగంగా ఉస్మానియా ఆసుపత్రి కి వెళ్ళాలని అనుకున్నామని, అక్కడ రోగులకు వైద్యం అందడం లేదని,ఉస్మానియాలో సమస్యలు ప్రత్యక్షంగా చూడాలని అనుకున్నామని షర్మిల తెలిపారు.

తాను ఒక్కదాన్నే వస్తానని, పర్యటనకు అనుమతించాలని షర్మిల సవాలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని బ్రతకనివ్వడం లేదని, ప్రజల పక్షాన నిలబడితే గృహనిర్బంధం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని అలాగే చేశారని, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని, ప్రజల పక్షాన నిలబడటం తప్పా అని ప్రశ్నించారు. కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద టవర్స్ కడతామని కేసీఆర్ హామీ ఇచ్చారని, రూ.200 కోట్లతో కడతాం అని చెప్పిన హామీ ఏమయ్యిందన్నారు.

2023-03-28T10:45:21Z dg43tfdfdgfd