AP ACADEMIC CALENDER: ఏపీలో ఈ ఏడాది పాఠశాలలకు 88సెలవులు.. 229 పనిదినాలు

Ap Academic calender: ఏపీలో పాఠశాలలకు ఈ ఏడాది 229పనిదినాలుగా నిర్ణయించారు. జూన్‌12న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను మంత్రి బొత్స విజయవాడలో విడుదల చేశారు.

ఈ ఏడాది పాఠశాలలకు 229 పనిదినాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని పండుగలు, దసరా, సంక్రాంతి సెలవులు కలుపుకుని 88రోజుల పాటు సెలవులుగా నిర్ణయించారు.

ఏపీలో ఉన్నత పాఠశాలలకు ఉదయం 9గంటల నుంచి 5గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలలకు ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు తరగతులు నిర్వహిస్తారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చివరి పీరియడ్లను క్రీడలకు కేటాయించారు.

ఒంటిపూట బడుల సమయంలో ఉదయం 7.45నుంచి మధ్యాహ్నం 12.30వరకు తరగతులు నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్ సబ్జెక్టులను 6,7 తరగతుల్లో ఫిజిక్స్ టీచర్లు బోధించాల్సి ఉంటుంది. 8,9,10 తరగతుల్లో బయాలజీ టీచర్లు ఎన్విరాన్‌మెంటె సైన్స్ బోధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఇంగ్లీష్ టీచర్లతో పాటు డిగ్రీ, పీజీలో ఆంగ్లంలో చదివిన వారు టోఫెల్ బోధనలో సహాయకులుగా ఉండాలని నిర్ణయించారు.

పాఠశాలల్లో ప్రతి మంగళ, గురు, శనివారాల్లో టోఫెల్ పరీక్షలు నిర్వహించాలని అకడమిక్ క్యాలెండర్‌లో సూచించారు. శనివారం సెలవు వస్తే శుక్రవారమే దానిని నిర్వహించాల్సి ఉంటుంది.

ఒకటి రెండో తరగతుల విద్యార్దులకు ప్రతి నెల మొదటి, రెండో శనివారాలను నో బ్యాగ్ డే అమలు చేయాల్సి ఉంటుంది.

తొమ్మిదో తరగతి తెలుగు సబ్జెక్టులో చైతన్యం, మాట మహిహ, ప్రియమైన నాన్నకు, నా చదువు పాఠాలను పాఠ్యాంశాల నుంచి తొలగించారు. పదో తరగతిలో ధన్యుడు, సముద్రలంఘనం పాఠాలను తొలగించినట్లు ప్రకటించారు.

ఈ ఏడాది సెలవులు ఇవే....

ఏపీలో ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ 14 నుంచి 24వ తేదీ వరకు ఇస్తారు. నవంబర్‌ 12న దీపావళి సెలవుగా ప్రకటించారు.డిసెంబర్ 25 న క్రిస్మస్ సెలవు ప్రకటించారు.

సంక్రాంతి సెలవులు 2024 జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు ఇస్తారు. క్రిస్టియన్ మైనార్టీ విద్యా సంస్థలకు దసరా సెలవులు అక్టోబర్ 21 నుంచి 24వరకు ఇస్తారు. డిసెంబర్ 17 నుంచి 26వరకు క్రిస్మస్ సెలవులు ఇస్తారు. సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు నిర్ణయించారు.

ఈ ఏడాది పరీక్షల తేదీలు...

ఒకటి నుంచి తొమ్మిది వరకు ఫార్మెటివ్ 1 పరీక్షల్ని ఆగష్టు 1-4మద్య నిర్వహిస్తారు. ఫార్మెటివ్అక్టోబబర్ 3-6 తేదీల మధ్య నిర్వహిస్తారు. సమ్మెటివ్ 1 పరీక్షలు నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఫార్మెటివ్ 3 పరీక్షలు జనవరి 3-6 తేదీలలో, ఫార్మెటివ్ 4 పరీక్షలు ఫిబ్రవరి 23-27తేదీల్లో నిర్వహిస్తారు.

పదోతరగత ప్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 23-29మధ్య, సమ్మెటివ్ 2, సిబిఏ 3 పరీక్షలు ఏప్రిల్ 11-20 తేదీల మధ్య నిర్వహిస్తారు.

2023-06-09T01:59:26Z dg43tfdfdgfd